మారంరెడ్డి జనార్దనరెడ్డి సీనియర్ జర్నలిస్టు
నంద్యాలజూలై26(ప్రజాన్యూస్):తనను 6సార్లు గెలిపించిన పాణ్యం నియోజకవర్గ ప్రజలుతనకు ఊపిరి శ్వాస అంటూ పదేపదే చెప్పుకునే ఎంఎల్ ఎ కాటసాని తన వ్యతిరేకులపై దైవాస్త్రం సంధించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు..తన రాజకీయ ప్రత్యర్ధులను అవలీలగా ఎదుర్కునే కాటసాని స్వపక్షంలోెని వ్యతిరేకులను ఎదుర్కొనడానికి దైవాస్త్రంతో ఢీకొట్టాలనుకుంటున్నారు..త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కాటాసాని బెర్తు దొరకకుండా అదికార పక్షంలోని కొందరు వ్యక్తులు ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం..ఈవిషయాన్ని కాటసాని కూడా పసిగట్టారు..అయితే ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు..తనకు ఏ కష్టం వచ్చిన ముందుగా యాగంటీశ్వరుని అటు తరువాత శ్రీ వెంకటేశ్వరస్వామి తోపాటుగా ఇతర దేవతలను వేడుకునే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు కాటసాని.ఇందులో భాగంగా ఇటీవల కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో రెండుసార్లు దర్శించుకున్నారు..ఇక యాగంటీశ్వరుడు,కొత్తూరు సుబ్రహ్మణ్యస్వామి తరుచూ తనతోపాటు కుటుంబసభ్యులతో కలిసి పూజలుచేస్తున్నారు..మొత్తం మీద ఏ అవకాశం వచ్చినా సీనియర్ ఎంఎల్ ఎ అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టిలబ్ది పొందిలని చేస్తున్న ప్రయత్నాలను దైవాస్త్రంతో డీకొనడం తప్పమరో మార్గంలేదని భావిస్తున్నారు..ముఖ్యమంత్రి జగన్ ఇష్టపడని ప్యాక్షన్ హత్యలతో కాటసానిని ముడిపెట్టడానికి కొందరు అంతర్గతంగా ప్రయత్నంచేసి విపలమయ్యారు..కాటసాని ప్రాతినిద్యం వహిస్తున్న గడివేముల మండలం పెసరాయి గ్రామంలో జరిగిన హత్య సంఘటనలకు కాటసానిని భాద్యుడినిచేయాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు..అలాగే ఇతర ఆరోపణలు చేస్తు మరికొన్ని పిర్యాదులను ప్రభుత్వానికి కుట్రదారులు పంపినట్లు తెలుస్తోంది..మొత్తం మీద కుట్రలపై కాటసాని ప్రయోగిస్తున్న దైవాస్త్రంతో ఎలాంటి పలితం ఇస్తుందో మంత్రివర్గ విస్తరణలో తేలుతుంది..
ముఖ్యమంత్రి జగన్ కు అన్నీ తెలుసు..కాటసాని
ఇది ఇలా ఉంటే కాటసాని మాత్రం ముఖ్యమంత్రిజగన్ పై పూర్తి విశ్వాసంప్రకటిస్తున్నారు.తమ అదినాయకుడు ముఖ్యమంత్రి జగన్ కు అన్నీతెలుసని కుట్రలను కుతంత్రాలను వెంటనే పసిగడితాడు..సూపర్వర్కరా..కాదాఅనేదిపరిశీలించినిర్ణయంతీసుకుంటాడు..కుట్రలుచేస్తున్నారని సమాచారం ఉంటే నేనైనా ఇతరులు అయిన సహించడు నేనైతే ఎవరిపై కుట్రలుచేయను ఎవరికి దైవబలం ఉంటే వారికి మేలు జరుగుతుందని భావిస్తాను .జగన్ పై నాభాద్యత వదిలిపెట్టను ఆకుటుంబం అంటే ఈరోజు కాదు ఎప్పటినుంచో నాకు ప్రాణం..తనకు మేలుజరిగినా జరగకపోయినా జగన్ నాకు సూపర్ బాస్ ..కుట్రలేమైనా పాణ్యం ప్రజలే నాకు అండ అంటున్నారు కాటసాని