ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 26మార్చి 2026(ప్రజాన్యూస్) :

బనగానపల్లె మండలం టంగటూరు ప్రాదమిక పాఠశాలకు నంద్యాల ఇన్నర్ వీల్ లామినేటెడ్ చిత్రపటాలను బహుకరించింది..ఈమేరకు నంద్యాల ఇన్నర్ వీల్ క్లబ్ అద్యక్షురాలు m.n.మల్లేశ్వరి ఆధ్వర్యంలో టంగుటూరు లోని ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ కు అవసరమైనటువంటి దేశనాయకులు ,స్వాతంత్ర సమరయోధుల లామినేటెడ్ చిత్రపటాలను ఇన్నర్‌వీల్ క్లబ్ సభ్యులు v.శోభరాణి మరియు ప్రెసిడెంట్ m.n.మల్లేశ్వరి గారి అర్థిక సహకారముతో ప్రధానోపాధ్యాయుడు జగదీష్ గారికి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ సభ్యులు సుశీల మరియు శైలజ రోటరీ క్లబ్ అధ్యక్షుడు,న్యాయవాధి M. వివేకానంద రెడ్డి ,ఆధ్యాపకులు విశ్వం,విద్యార్థి ని,విద్యార్థులు పాల్గొన్నారు.