ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి![]()
నంద్యాల,25 డిశెంబరు 2025(ప్రజాన్యూస్)
తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధిగా మున్నూరు అక్బర్ రెండవసారి ఎంపికయ్యారు. జిల్లాల వారీగా టీడీపీ కార్యవర్గ జాబితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ననే ప్రకటించడం జరిగింది. కడప జిల్లా నూతన టిడిపి అధ్యక్షునిగా భూపేష్ రెడ్డి ఎంపిక కాగా, పార్లమెంట్ అధికార ప్రతినిధిగా మన్నూర్ అక్బర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా తనను రెండవ పర్యాయం కూడా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించినందుకు మన్నూర్ అక్బర్ పార్టీ హై కమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలకు సహాయ సహకారాలు అందించి కృషి చేస్తున్న మాజీ శాసనమండలి సభ్యులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ అన్నకు అక్బర్ కృతజ్ఞతలు తెలిపారు. కమలాపురం నియోజకవర్గం లో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనకు సహాయ సహకారాలు అందజేస్తున్న మీడియా పాత్రికేయులు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులందరికీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి మన్నుర్ అక్బర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.