జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించిన జిపిఎస్ నాయకులు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది

నంద్యాలజూలై25(ప్రజాన్యూస్):గిరిజన  సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు , వై.ఎస్.ఆర్.సి.పి యువనేత,వడిత్యా శంకర్ నాయక్ జన్మదినం వేడుకలు నంద్యాల పట్టణం SRBC కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నందు ఘనంగా నిర్వహించారు.

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడురాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి వైసిపి నేత ప్రతాపరెడ్డి ముఖ్య అతిదిగా హాజరయి పేద చిన్న పిల్లలకు అన్నదానం చేశారు

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్, ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ..విద్యార్థి దశ నుండి గిరిజనుల సమస్యల కోసం పోరాటం చేస్తున్న వడిత్యా శంకర్ నాయక్ ను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన సమస్యలపై పోరాటాలే కాకుండా,సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు..అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న అని, ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యం అని అన్నారు.

సాటి మనిషికి సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు. మనం చేసే మంచి పనులే చిరకాలంనిలుస్తాయనిఈకోవలోగిరిజినసమాఖ్యనాయకులుసేవలుఅందించడంహర్ణనీయమని,పోరాటాలే కాక ప్రజాసేవ లోనూ గిరిజన ప్రజా సమాఖ్య ముందుందని కొనియాడారు.

కరోనా కష్టకాలంలోనూ జి.పి.ఎస్ నేతలు వారి కష్టాలను గుర్తించి,తండా, చెంచు గుడాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారని అన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ముందుండాలని గిరిజన సోదరి సోదర మణులకు పిలుపునిచ్చారు.ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఐక్యమత్యంగా ఉండి సమస్యలపై పోరాటంలో ముందుండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్,కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ విజయ్ నాయక్, విద్యార్థి విభాగం జి.వి.ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్,జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల నాయక్, కార్యవర్గ సభ్యుడు పుల్లన్న నాయక్,ఆంధ్రప్రభ ఇంచార్జి శివ కుమార్ రెడ్డి,జమాల్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *