ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
నంద్యాల జులై 25(ప్రజాన్యూస్):కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నపురం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా వెళ్లునుకున్న మూఢచారాలకు చెక్ పెట్టారు యువ సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పెయ్
ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలో ని పొన్నాపురంలోనిదళితవాడ లో దళితులకు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శనభాగ్యం ను. నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ కల్పించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నంద్యాల
పట్టణము
పొన్నాపురం లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దైవదర్శనానికి దళితులను అనుమతించ లేదంటూ కొందరు ఫిర్యాదు చేశారని అందుకొరకే పొన్నాపురం గ్రామాన్ని సందర్శించడం జరిగింది అన్నారు . ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలని ప్రభుత్వం దృష్టిలో అన్ని కులాల వారు సమానమేనని దళితులు కూడా దైవ దర్శనం చేసుకోవచ్చన్నారు ఈరోజు కొంతమంది దళితులు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలు చేసుకున్నారన్నారు దేవాలయాల వార్షికోత్సవాల్లో గాని. కల్యాణ ఉత్సవాలలో. అందరూ పాల్గొని కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అన్నారు పొన్నాపురం లో ఉంటున్న వార్డ్ కౌన్సిలర్ వార్డులో గల అన్ని మతాలప్రజలను సమాన దృష్టితో చూడాలని ఆమె అన్నారు. దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కంటే ముందుగానే గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి గలాటలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సవ కార్యక్రమాల్లో కూడా దళితుల వాడ వరకు పీఠాలు వెళ్లాలని ఆమె అన్నారు అనంతరం సబ్ కలెక్టర్ దేవాలయం నుండి దళిత వాడ వరకు పర్యటించి దళితులతో మాట్లాడారు దళితుల కోరికమేరకు దైవ దర్శనాలు చేసుకోవచ్చని ఆమె అన్నారు
ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ పుల్లయ్య. పూజారి కళ్యాణ్. వార్డు కౌన్సిలర్ పుల్లయ్య. కొంతమంది దళితులు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు