ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,24మే 2025(ప్రజాన్యూస్)
వక్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం ముస్లింలు శాంతి యుత ప్రదర్శన నిర్వహించారు. ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో ముస్లిం సోదర సోదరీమణులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా నాలుగు రోడ్ల కూడలి, ఆర్టీసీ బస్టాండ్ వరకు జాతీయ పతాకాలతో పాటు, నల్ల జెండాలను ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వక్స్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ప్లే కార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జామియా మర్కస్ పాత మసీదు ఇమామ్, మండల ప్రభుత్వ ఖాజీ జాఫర్ మహమ్మద్ సాదిక్, ముస్లిం వెల్ఫేర్ నాయకుడు అమీర్ భాష పాల్గొన్నారు.