జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పామ్డెంట్ ఎక్సలెన్సు ఇన్ డెంటిస్ట్రీ అవార్డు అందుకున్న డెంటల్ వరల్ట్ అదినేత డా సుదాకర్

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 24 మార్చి 2026(ప్రజాన్యూస్) :

నంద్యాల పట్టణంలో గత 16 సంవత్సరాలుగా అనేక మందికి ఉత్తమ దంత వైద్య సేవలను అందిస్తున్న డా సుదాకర్ డెంటల్ వరల్డ్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పామ్డెంట్ ఎక్సలెన్సు ఇన్ డెంటిస్ట్రీ అవార్దు గెలుచుకుంది..ఈ మేరకు ముంబయిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో  డెంటల్ వరల్డ్ అదినేత డా సుదాకర్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు..

నంద్యాల పట్టణంలో గత 16 సంవత్సరాలుగా అనేక మందికి ఉత్తమ దంత వైద్యసేవలను అందిస్తూ నంద్యాల మరిసర ప్రాంత ప్రజల విశ్వాసం మరియు ఆదరణ పొందిన సుదాకర్ డెంటల్ వరల్ట్ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో ప్రతిస్టాత్మక అవార్డు లభించింది..ఈ మేరకు ప్యూచర్ డెంట్ సంస్థ ఆర్గనైజింగ్ చేసిన కార్యక్రమంలో పామ్ డెంట్ ఎక్సలెన్సు అవార్డును డా సుదాకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు..ఈ సందర్బంగా డాక్టర్ సుదాకర్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు విశిష్ట సేవలుఅందించినందుకు ప్రతిపలంగా తనకు జాతీయ స్థాయిలో అవార్డు లభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు..తనను ఇంత స్థాయికి తీసుకు వెళ్లిన నంద్యా ప్రజలకు డెంటల్ రంగంలో మరిన్ని సేవలను అందిస్తామని, ఈ ప్రతిష్టాత్మక అవార్డు తమ సంస్థకు మరింత భాద్యతను పెంచిందన్నారు..తమ సంస్తకు ఈగుర్తింపు రావడానికి కారణమైన ప్రజలకు తమ సిబ్బందికి అవార్డు ప్రదాతలకు డాక్టర్ సుదాకర్ ఈ సందర్బంగా తన కృతగ్నతలు తెలియచేశారు..కాగా డాక్టర్ సుదాకర్ డెంటల్ వరల్డ్ సంస్ధకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల నంద్యాల పట్టణంలోని ప్రముఖులు మేదావులు వైద్య రంగ ప్రముఖులు ప్రజలు డాక్టర్ సుదాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *