నంద్యాల ఆగష్టు 24(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లా నంద్యాలమునిసిపాలిటి తెలుగుదేశంపార్టీ ప్లోర్ లీడరుగా పట్టణంలోని 34 వవార్డు కౌన్నిలర్ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..ఈమేరకు టిడిపి పార్టీ తమ పార్టీ ప్లోర్ లీడరును ప్రకటించింది.ఈసందర్బంగా టిడిపి ప్లోర్ లీడర్ వలి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను ప్లోర్ లీడరుగా ఎంపికకావడానికి కౄషిచేసిన మాజీ ఎంఎల్ ఎ భూమా బ్రహ్మానందరెడ్డికి, మాజీ మంత్రి ఎన్ ఎండి పరూక్ కి పార్టీ అదినాయకత్వానికి సహచర కౌన్సలర్ లకు తనను కౌన్సిలర్ గా ఎన్నుకున్న విసికాలనీ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు..వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజాసమస్యలపై కౌన్సిల్ లో పోరాడతానని పార్టీకి నేతలకు మంచి పేరు తెస్తానన్నారు..నంద్యాల తమవార్డు సమస్యలేకాక పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి ప్రతిపక్షపాత్రను చురుకుగా పోషిస్తానన్నారు..కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాస్కరరెడ్డి తదితరులు ఉన్నారు..