ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,24మే 2025(ప్రజాన్యూస్)
ఆళ్లగ్డడ్డ నియోజకవర్గంలోని ‘చాగలమర్రి పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 2,లక్షల ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ తెలిపారు.
ఆళ్లగడ్డ డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాగలమర్రిలోని మల్లెవేముల రస్తాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ నడుము జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో కొందరు యువకులు బెట్టింగ్ ఆడుతున్న సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. 4 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖాజీ మహమ్మద్ రఫీ, మద్దిలేటి రెడ్డి, చాకలి హరికృష్ణ, బాబా ఫక్రుద్దీన్, షేక్ షరీఫ్ అనే వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. యువత బెట్టింగ్ల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు. యాప్స్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా ఆడిన కూడా తమకు తెలుస్తుందన్నారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐమురళీధర్ రెడ్డి, చాగలమర్రి ఎస్సై సురేష్ పాల్గొన్నారు.