ప్రజాటివి ప్రతినిది ప్రబాకర్ చౌదరి
పాడి రైతులకు శుభవార్త చెప్పిన కర్నూలు జిల్లా మిల్క్ యూనియన్
నంద్యాల,మార్చి 24 (ప్రజాన్యూస్) ;;కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 16వ తేదీ నుంచి పాడి రైతులకు పాల సేకరణ ధర పెంచినట్లు కర్నూలుజిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్ మోహనరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. పాడి రైతులకు పశు పోషణ సంబంధించి అన్ని ధరలు పెరిగినందున ఈ విషయాన్ని గుర్తించి రైతులకు పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..
గేదె మరియు ఆవుపాల ఉత్పత్తిదారులకు ఈ పెరిగిన ధరలు వర్తించనున్నాయని,పాల సేకరణ ధరను కేజీ వెన్న( కేజీ ఫ్యాట్ ) శాతం ఆధారంగా గేదె పాలకు కిలో 740 రూపాయల నుంచి 760 రూపాయలు గాను.. ఆవుపాల ధరను ఒక రూపాయి చొప్పున పెంచినట్లు ఆయన తెలిపారు.. పెరిగిన పాల సేకరణ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులందరికి వర్తిస్తాయని చైర్మన్ జగన్ మోహనరెడ్డి తెలిపారు..