!!ఈవిఎంల ర్యాండమైజేషన్ డ్రై రన్ ,, జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు!!

♦ప్రజాటివిప్రతినిది ప్రభాకర్ చౌదరి

రానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవిఎంల తొలి ర్యాండమైజేషన్ పై సంపూర్ణ అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.

శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈవిఎంల ర్యాండమైజేషన్ డ్రై రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఎ. పద్మజ, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ అసెంబ్లీ మరియు పార్లమెంటు, సెగ్మెంట్ల వారిగా కేటాయించే ఈవిఎంల ర్యాండమైజేషన్ డ్రై రన్ పై పూర్తి స్థాయి శిక్షణ పొందాలన్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2030 కంట్రోల్ యూనిట్లు, 2509 బ్యాలెట్ యూనిట్లు, 2452 వివి ప్యాట్లు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1924 కంట్రోల్ యూనిట్లు, 2520 బ్యాలెట్ యూనిట్లు, 2451 వివి ప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తిచేసుకుని ఓటింగ్ ప్రక్రియకు సిద్ధంగా వున్న ఈవిఎంలను జిల్లా ఎన్నికల అధికారి లాగ్ ఇన్ లో తొలి ధపా ర్యాండమైజేషన్ జరుగుతుందన్నారు.

జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి స్థాయిలో రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి అనంతరం పోలింగ్ కేంద్రాల కు కేటాయించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎఈఆర్ఓలు, ఎన్నికల విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *