♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఖచ్చితమైన నిఘా వుంచి ప్రతి విషయాన్ని నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్, వీడియో వ్యూవింగ్ బృంద అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో సాధారణ ఎన్నికలు -2024లో భాగంగా ఎంసిసిటీ, ఎస్ఎస్టి, విఎస్టి, వివిటి, ఎఫ్ఎస్టి టీంలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎస్ఎస్టి, విఎస్టి, వివిటి, ఎఫ్ఎస్టి మరియు ఎంసిసి టీమ్ అధికారుల పాత్ర కీలకమైందని, భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించి విధులు నిర్వహించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీంలను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొంది ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి స్థాయిలో మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఆయా టీంల అధికారులు అన్ని విధాల సన్నద్ధమై ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలన్నారు. నిరంతరం ఎస్ఎస్టి, విఎస్టి, వివిటి, ఎఫ్ఎస్టి మరియు ఎంసిసి టీమ్ అధికారులు అప్రమత్తంగా వుండి ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. సివిజిల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా కాకుండా ఐటీ, ఎన్ పోర్స్ మెంటు శాఖలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను ఆ రోజే పరిశీలించి రిపోర్టులు ఇవ్వాలన్నారు.*
జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలలో శాంతి భద్రతలు పక్కాగా అమలు పరచేందుకు ఎస్ఎస్టి, విఎస్టి, వివిటి, ఎఫ్ఎస్టి మరియు ఎంసిసి టీమ్ అధికారులు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి అమలులో ఉంటుందని, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులకు అందుబాటులో ఉంటామని, ఎలాంటి సమస్యలు, సందేహాలు నెలకొన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్ఓ ఎ. పద్మజ, ఎస్ఎస్టి, వివిటి, ఎఫ్ఎస్టి మరియు ఎంసిసి టీం ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.