వరుసగా 29 వ ఏడాది ఇంటర్ పలితాలలో రావూస్ ప్రభంజనం..విజేతలను అబినందించిన చైర్మన్ అప్పారావ

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది

నంద్యాలజూలై23(ప్రజాన్యూస్): సీనియర్ ఇంటర్ పలితాలలో వరుసగా 29 వయేడాది రావూస్ ప్రభంజనం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపల్ అప్పారావు తెలిపారు..ఇంటర్ మీడియట్ చరిత్రలో ఒకే సంవత్సరం ఒకే కళాశాలనుండి 6 మంది విద్యార్ధులు 1000కి 980 మార్కులు రికార్డులుసృష్టించారన్నారు..ఈసందర్బంగా ఏర్పాటుచేసిన అభినందనసభలో ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య మాట్లాడుతూ బైపిసి విభాగం నుండి ఉమేష్ అనే విద్యార్ధి 1000మార్కులకు 988 మార్కులు,హారిక 1000 కి 985 మార్కులు,వైష్ణవి 1000కి 979 మార్కులు అనూష 1000కి 977 మార్కులు సాదించి చరిత్ర సృష్టించారన్నారు..యంపిసి విభాగమునందవు సువైభా 985 మార్కులు సాదించిన పట్టణ ప్రదమస్థానాన్ని నీరజ 984 మార్కులు సాదించి పట్టణంలో ద్వితీయస్థానాన్ని కైవసంచేసుకుందన్నారు..అలాగే సత్యవతి 981,తమ్ కిన్ 981,ముద్దసిర్ 978 సుజీత 975 ఇంతియాజ్ అహ్మద్ 975 పాటు 970 మార్కులకు పైగా 12మంది విద్యార్ధులు సాదించారన్నారు..యంఇసి విభాగం నందు షర్మిలారెడ్డి 952 మార్కులతో నంద్యాలపట్టణంలో ప్రదమస్థానాన్ని 929 పూజిత, సిద్వివిలాస్ 921 మార్కులతోపాటుగా 900పైన 6మంది విద్యార్ధులు సాదించారన్నారు..సిఇసిగ్రూపునందు కూడా జాహ్నవి భాయి 942 మార్కులతో నంద్యాలపట్టణంలో ప్రధమస్థానాన్ని ,సమీర 939,సంజీవరెడ్డి 938 హర్సిని 938 మార్కులు సాదించడంతోపాటుగా 900కిపైగా 8 మంది విద్యార్ధులు సాదించారన్నారు..సీనియర్ ఇంటర్ లోవిజయదుందుబి మ్రోగించిన విద్యార్ధులను అద్యాపక బృందాన్ని కళాశాలచైర్మన్ అప్పారావు అబినందించారు..కార్యక్రమంలో సంజీవనగర్ క్యాంపస్ ప్రిన్సిపల్ జగదీష్రారావు మరియు అద్యాపకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *