ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
👉 లయన్స్ గవర్నర్ పర్యటన సందర్భంగా మూడు లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు
👉.దివ్యాంగులకు కుట్టు మిషన్లు, వినికిడి యంత్రాలు,చక్రాల కుర్చీలు , మందుల పంపిణీ.
👉. దివ్యాంగ విద్యార్థులు 11 మందికి ఉపకార వేతనాలు
👉. 30 దివ్యాంగ కుటుంబాలకు ఉగాది రంజాన్ సరుకుల కిట్లు పంపిణీ
👉. జీవనజ్యోతి అందులో పాఠశాలకు బియ్యము నిత్యవసర కిట్ల పంపిణీ
👉. లైఫ్ పరివర్తన సెంటర్ హెచ్ఐవి బాలలకు నిత్యావసర సరుకుల పంపిణీ
*********
నంద్యాల మార్చి 23 (ప్రజాన్యూస్)
ఆదివారం లయన్స్ జిల్లా గవర్నర్ మాఘం గౌతం నంద్యాల పర్యటన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్, కార్యదర్శి శిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ల నాగరాజుల నిర్వహణలో,ఐ.ఎమ్ ఏ .రాష్ట్ర మాజీ అధ్యక్షుడు,లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ,లయన్స్ జిల్లా చైర్మన్,దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.పీ.వి. రమణయ్యల పర్యవేక్షణలో పట్టణంలో మూడు లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు.
బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భారీ సేవా కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగ మహేష్, కూర ప్రసాద్ అరవేటి రాఘవేంద్రల సహకారంతో పేద మహిళకు ఉపాధి కోసం తోపుడు బండి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ లగిశెట్టి విజయ్ కుమార్ శెట్టి,రావుస్ విద్యా సంస్థల అధినేత అప్పారావు, గురు రాజా స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి,తోట శ్రీనివాస్, కూర మురళీకృష్ణ ప్రసాద్,పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు, రవి ప్రకాష్ ,గోళ్ళ సుదర్శనం, రామన్న, సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, బాలాజీ విద్యా మందిర్ కరస్పాండెంట్ ఆర్ల వెంకటస్వామిల సౌజన్యంతో 15 మోటార్ తో పనిచేసే కుట్టు మిషన్లు,బేకర్స్ పార్క్ అధినేత సవ్వా మనోహర్ రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ రాజీవ్,ఇమ్మడి వెంకట రామకృష్ణుడు, రాయసం బాబురావు, శ్రీ రామ డిజిటల్ అధినేత చంద్రమోహన్ ల ఆర్థిక సహకారంతో 5 చక్రాల కుర్చీలు,బవిరిశెట్టి శ్రీకాంత్, కసెట్టి చంద్రశేఖర్, రావుస్ కళాశాల మౌని చంద్ర, రాహుల్ ప్రింటర్స్ చంద్రమౌళీశ్వర రెడ్డి, దూదేకుల దస్తగిరి, నాగ వీరాంజనేయులు విరాళంతో ఆరు మంది బధిరులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు.22 మంది పేద విద్యార్థులకు రెండు వేల రూపాయల చొప్పున గోళ్ల సుదర్శనం,బాల అకాడమీ రవీంద్రనాథ్,ఎలుకూరి సురేష్, చింతమాని లాలి స్వామి,గుండె వైద్య నిపుణులు డాక్టర్ మురళీకృష్ణ ల సహకారంతో ఉపకార వేతనం అందజేశారు.
నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్స్ అధినేత రమేష్ సౌజన్యంతో 10 మంది దివ్యాంగులకు నెలవారి మందులు అందజేశారు.
స్థానిక స్నేహ వృద్ధాశ్రమానికి లయన్స్ యువజన విభాగం సభ్యులు కూర ప్రసాద్, రాజ్ భవన్, వంకదారి భరత్, కిషోర్ , సుహాస్ రాఘవ, పవన్, రాఘవ, డాక్టర్ శ్రవణ్ కుమార్, సందీప్, సుజిత్ రాఘవ, బొగ్గరపు పవన్ ల సౌజన్యంతో 100 కేజీల కంది బేడలు అందజేశారు. స్నేహ వృద్ధాశ్రమంలో స్వామి రెడ్డి, ఉపేంద్ర రెడ్డి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. నంద్యాల శివార్లలో పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు ఏర్పాటుచేసిన లయన్స్ క్లబ్ స్వాగత బోర్డ్ ను లయన్స్ గవర్నర్ మాఘం గౌతం ఆవిష్కరించారు.
పోలూరురోడ్డు లో ఉన్న జీవనజ్యోతి అంధుల పాఠశాలలో ఉన్న 25 మంది అంధ విద్యార్థులకు కాస్మెటిక్స్ కిట్లు,50 కేజీల బియ్యం లైన్స్ క్లబ్ కోశాధికారి మామిళ్ల నాగరాజు సౌజన్యం తో అందజేశారు.
40 మంది దివ్యాంగ కుటుంబాలకు ఉగాది, రంజాన్ సరుకుల కిట్లను సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కుంచా మహేశ్వరరెడ్డి,లెక్చరర్ కుమ్మరి సురేష్, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య, పాలూరి ప్రశాంత్,జాకీర్ హుస్సేన్ ,డివి సుబ్బయ్యల సహకారంతో అందజేశారు.
లైఫ్ పరివర్తన సెంటర్ హెచ్ఐవి బాలలకు నిత్యావసర సరుకులు పసుపులేటి రఘురాముడు సహకారంతో అందించారు.
వివిధ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలను సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కసెట్టి వేణుమాధవ్, ఎం.పీ. వి. రమణయ్య, సతీష్ కుమార్ ల సహకారంతో శాలువా పూలమాలలతో సత్కరించి అభినందించారు.
మధ్యాహ్నం బాలాజీ కళ్యాణమండపం సమావేశ భవనంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ మాఘం గౌతమ్ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత ఐదు దశాబ్దాల పైగా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న దని ప్రశంసించారు. జీవనజ్యోతి అంధుల పాఠశాలకు క్లాస్ రూమ్ బెంచీల కోసం విరాళం ప్రకటించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు పలువురు తమ పిల్లలను లయన్స్ క్లబ్ లో చేర్పించి వారితో సేవా కార్యక్రమాలను నిర్వహింప చేసి సేవా వారసత్వాన్ని అందించడం విశేషం అన్నారు. పిల్లలకు ఆస్తులతో పాటు సేవా తత్వాన్ని కూడా వారసత్వంగా పంచాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ మాజీ చైర్మన్ ఏ. వి.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ అంధుల కోసం కృత్రిమ మేధ తో రూపొందించిన కంటి అద్దాలను నంద్యాలలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో దృష్టిలోపం ఉన్నవారికి అందించడానికి అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థతో సంప్రదిస్తామని ప్రకటించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి శిరిగిరి రమేష్
భవిష్యత్తులో నంద్యాల లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు . లయన్స్ గవర్నర్ మాఘం గౌతమ్ ను నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ సంస్థల మాజీ చైర్మన్ ఎవిఆర్ ప్రసాద్ , జాన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నెల్లూరు లయన్స్ క్లబ్ నాయకులు విక్రమ్, కిరణ్, ఎంపీ వి రమణయ్య,లయన్స్ సభ్యులు, వివిధ సేవా కార్యక్రమాలకి సహకరించిన దాతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.