✤ ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
✤ నామినేటెడ్ పోస్టుల్లో అర్హులకు అవకాశం.
✤ బిజెపి పార్టీ నిర్మాణం,బలోపేతానికి కృషి చేద్దాం.
✤ 36 మండలాల్లో బిజెపి ఎదగాలి.
నంద్యాల,మార్చి 23 (ప్రజాన్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బిజెపి నాయకులకు అవకాశం ఉంటుందని సంఘటన మంత్రి మధుకర్ జి పేర్కొన్నారు.స్థానిక జయంతా వెజ్ వరల్డ్ లో నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మదు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సంస్థాగత జిల్లా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా సంఘటన మంత్రి మధుకర్ జి,జోనల్ ఇన్చార్జి భీట్రా శివనారాయణ,జిల్లా ఇన్చార్జి రమేష్ నాయుడు లు పాల్గొన్నారు.బిజెపి పెద్దలు జ్యోతిప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మదు,సంఘటన మంత్రి మధుకర్ జి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బిజెపి అర్హులైన నాయకులకు అవకాశం ఉంటుందని అన్నారు.జిల్లాల వారీగా అర్హులైల వారి పేర్లు అధిష్టానానికి పంపించాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా 222 మార్కెట్ యార్డ్ కమిటీలతో పాటు ,కమిటీ చైర్మన్లు,21 ప్రధాన దేవాలయాల్లోపాలక మండళ్లు తో పాటు వివిధ నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తున్న నేపథ్యంలో కూటమిలో భాగంగా బిజెపి నాయకులకు అవకాశాలు లభిస్తాయని అన్నారు.36 మండలాల్లోని అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పార్టీ నిర్మాణం,బలోపేతానికి కృషిచేయాలని అన్నారు.బిజెపి అన్ని మండలాల్లో ఎదగాలని కోరారు.ఎన్నికలు ఏవి వచ్చినా ప్రతి బూతులో బలోపేతం చేయాలని పేర్కొన్నారు.బిజెపి పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు.దేశ వ్యాప్తంగా ప్రధాని మోది అభివృద్ధితో అన్ని రాష్ట్రాల్లో బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు. డిల్లీ ప్రజలు బిజెపి నీ స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు.బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ సమావేశంలో బీవీ సుబ్బారెడ్డి,ఎస్వీ రమణ,స్వామి రెడ్డి,ఉపేంద్ర రెడ్డి,కశెట్టి కృష్ణ మూర్తి,ఇంటి ఆదినారాయణ,నిమ్మకాయల సుధాకర్,షబానా,చల్లా దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.