♦ప్రజాటివిప్రతినిది ప్రభాకర్ చౌదరి
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద పేదల పేరిట రిజిష్టర్ చేసిన 8,000 ఇళ్ల పట్టాలను జిల్లా కలెక్టర్ డా.శ్రీనివాసులు లబ్దిదారులకు పంపిణీ చేశారు.
శుక్రవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నిరుపేదలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ ఖాజీ అబుల్ కలాం తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ ఖాజీ అబుల్ కలాంలు లబ్దిదారులకు రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్స్, ఇళ్ల పట్టాల పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున రెడ్డి, తాసిల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు