ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాలజిల్లా మొట్టమొదటి కలెక్టరు డా మనజీర్ జిలాని సామూన్ సక్సెస్ స్టోరీ
#అదికార ప్రతిపక్షాలను నొప్పించకుండా ప్రజలకు సేవలు
#పనిచేసే అధికారులకు గుర్తింపు పనిచేయని అదికారులపై కొరడా
#తొలిజిల్లాలో ప్రభుత్వ అసైన్ మెంటు తనదైన శైలిలో పూర్తి
#అసాంఘిక శక్తుల ఆగడాల నివారణకు టాస్క్ పోర్సు
#విద్య,వైద్య,సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి
రాజ్యాంగ విలువలు ,వృత్తి దర్మాన్ని పాటిస్తూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన బ్యూరోక్రాట్స్ అదికారపార్టీ అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు నేడు ఎక్కువయ్యాయి..ఈనేపద్యంలో అదికార,ప్రతిపక్షపార్టీలను నొప్పించకుండా ప్రజలకు అందాల్సిన సంక్షేమం, ప్రజాసమస్యలపరిష్కారంలో తనదైన చొరవచూపించి శహబాష్ కలెక్టరు అనిపించుకున్నారు ఓ యువ ఐఎ యస్ ఆపీసర్..అయ్యా ఎస్ అంటూ అదికార పార్టీకి జీ హుజూర్ అనకుండా తాను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని నిరూపించి తొలి జల్లా కలెక్టరుగా తన సత్తా చూపించారు ఆ యువకిశోరం..పలితంగా తొలిజల్లా తొలికలెక్టరుగా పేద ప్రజల్లో గుండెల్లో నిలిచారు నంద్యాల జిల్లా కలెక్టరు డా మనజీర్ జిలాని సామూన్.
జమ్మూ కాశ్మీర్ కు చెందిన డా మనజీర్ జిలాని సామూన్ 2012 లో యుపి ఎస్ సి పరీక్షలలోప్రతిభ కనబరిచి ఐఎఎస్ గా ఎంపికయ్యారు.నాగాలాండ్ ఐ ఎ ఎస్ క్యాడర్ లో రిపోర్టు అయిన డా మనజీర్ జిలాని సామూన్ ఆ ప్రాంతంలో ఐఎఎస్ అదికారిగా పలుసేవలు అందించి ప్రజల మన్మనలు పొందారు.. 2015 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన మహిళా ఐ ఎ ఎస్ అదికారి తమీమ్ అన్ సారియాను వివాహంచేసుకున్నారు డాక్టరు మనజీర్ జిలాని సామూన్..స్పౌజ్ కేసులో 2019 లో వీరిరివురుని ఆంద్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది…ఈనేపద్యంలో ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్నం మునిసిపల్ కమీషనర్, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంటు ఆదారిటీ కమీషనర్లుగా డా మనజీర్ జిలాని దంపతులు నియమితులైనారు..పనిచేసే చోట నియమ నిబద్దలతో ప్రజాసంక్షేమంకోసం పాటుపడే డా మనజీర్ జిలాని సామూన్ కమీషనర్ గా అక్కడిప్రజలకు మరుపురాని సేవలు అందించి వారి మనసులో సుస్ధిరస్థానం ఏర్పాటుచేసుకున్నారు..అనంతరం ఆయన కర్నూలుజిల్లా జాయింట్ కలెక్టరుగా పనిచేశారు..జాయింట్ కలెక్టరుగా తనకున్న అదికారాలను వినియోగించి పేద ప్రజలకు దగ్గరయ్యారు..ప్రభుత్వ సంక్షేమపదకాలను ప్రజలకు చేరువచేశారు..ఉమ్మడి కర్నూలుజిల్లాలోకూడా అదికార ప్రతిపక్షనేతలను సైతం మెప్పించి పాలన సాగించారు యువ ఐఎయస్ అదికారి డామనజీర్ జిలాని సామూన్.
2022 ఏప్రియల్ 4 వ తేదీన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయడంతో ఉమ్మడి కర్నూలుజిల్లా రెండు జిల్లాలుగా విభజించారు..నంద్యాల కొత్తగా జిల్లాగా ఏర్పడింది..కొత్త జిల్లాకు మొట్టమొదటి జిల్లా కలెక్టరుగా డామనజీర్ జిలాని సామూన్ నియమితులయ్యారు..ఉమ్మడి కర్నూలుజిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు అందరికి తెలిసిందే కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..బడారెడ్ల పాలనలో ఇరుపక్షాలను మెప్పించి పాలన సాగించాలంటే కత్తిమీదసామే..అయితే యువ అదికారి నిజాయితీ నిబద్దత అన్ని వర్గాల నేతలను కట్టిపడేసింది..అందరికీ న్యాయంచేసే ముక్కుసూటి మనిషిగా రాజకీయ వర్గాలు భావించాయి..దీంతో ఆయన సుస్తిర పాలన వైపు దృష్టి సారించారు..ప్రభుత్వం చేపట్టినన నవరత్నాలు నాడునేడు జగనన్న సురక్ష,సచివాలయ వ్యవస్థ ,స్పందనలాంటి కార్యక్రమాలలో అదికారులను ఉరుకులుపరుగులుపెట్టించారు..పనిచేయనిఅదికారులపైకొరడాఝలిపించారు..రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టారు..రికార్డులు తారుమారుచేసి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న క్రిందిస్థాయి ఉద్యోగులపై వేటు వేశారు..రైతుల సమస్యల సాదనకు ప్రత్యేకంగా చర్యలుతీసుకుని శహభాష్ అనిపించుకున్నారు..జిల్లాలో అసాంఘిక శక్తుల భరతంపట్టేందుకు పోలీసు వ్యవస్థను అప్రమత్తంచేశారు..ల్యాండ్,శ్యాండ్ మద్యం మాపియాల ఆగడాలను అరికట్టేందుకు టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు..ఈప్రక్రియలో రాజకీయ వత్తిళ్లు ఉన్నప్పటికి వందశాతం కాకపోయినా తనవంతుగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు డాక్టర్ మనజీర్ జిలాని సామూన్