ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
నంద్యాల,22 సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన కూలి దూదేకుల వడ్ల దస్తగిరి కి చెందిన మట్టి మిద్దె భారీ వర్షాలతో ఆదివారం కూలిపోయింది. నిరాశ్రయులుగా మారిన దస్తగిరి కుటుంబానికి దూదేకుల సంఘం నాయకులు ఆసరాగా నిలిచారు.
ఈసందర్బంగా ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాలకు చెందిన దూదేకుల సంఘం నాయకులు, సభ్యులు దస్తగిరి కుటుంబానికి పదివేల రూపాయలు నగదు, తాత్కాలిక నిత్యావసర వస్తువులు, 50 కేజీల బియ్యముఅందజేశారు. ప్రభుత్వము బాదితులకు శాశ్విత సహాయం చేయాలని ,పక్కా గృహము నిర్మించాలని వారు ప్రభుత్వాన్నికోరారు.. ఈ సందర్భంగా బాధితుడు దస్తగిరి దూదేకుల సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ దూదేకుల సంఘ నాయకులు మరియు చాగలమర్రి మండల నాయకులు పాల్గొన్నారు.