ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
కర్నూలు,ఏప్రియల్ 22(ప్రజాన్యూస్)
కర్నూలు పట్టణం లోని బంగారుపేటలో నాటుసారా స్దావరాల పై మంగళవారం పోలీసు & ఎక్సైజ్ పోలీసులు కలిసి విస్తృతంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 65 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా,1350 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు.నీలి షికారి భాగ్యమ్మ పై కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు రెండవ పట్టణ పోలీసులు , ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు , ఎక్సైజ్ సూపరింటెండ్ సుధీర్ బాబు , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్ లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణరెడ్డి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు , మన్సురుద్దీన్, నాగశేఖర్ ఎక్సైజ్ సిఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, క్రిష్ణ పాల్గొన్నారు.