ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
పంట నీటి కుంటలను నిర్మించి సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో దాదాపు 3 వేల నీటి కుంటల ఏర్పాటుకు శ్రీకారం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, మార్చి, 22(ప్రజాన్యూస్) :-
పంటకు అవసరమయ్యే నీటిని నీటి కుంటల ద్వారా సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రైతులకు సూచించారు. శనివారం ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నీటి కుంటల ప్రారంభిస్తున్న సందర్భంగా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పంట నీటి కుంటల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డ్వామా పిడి వెంకటసుబ్బయ్య తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని పంటలకు అవసరమయ్యే నీటిని నీటి కుంటల ద్వారా సమకూర్చుకోవాలని రైతులకు సూచించారు. నీటి గుంటల కింద కూరగాయల సాగును కూడా చేపట్టవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటి కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో 3 వేల వరకు నీటి కుంటలు ఏర్పాటు చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. జిల్లాలో 1/3 వంతు భూములు ఉపరితళంగా ఉండడం, ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఉన్న కారణంగా కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో జిల్లాలోని రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో 3 మీటర్ల నుండి 25 మీటర్ల లోతు వరకు నీటి సాంద్రత ఉన్న గ్రామాలు ఉన్నందున మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో పెద్ద ఎత్తున నీటి కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే వేతనదారులు కూడా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయాన్నే పనులకు త్వరగా వచ్చి ఉ.11 గంటల లోపు ముగించుకొని వెళ్లేలా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉపాధి హామీ వేతనదారులకు ప్రభుత్వం నుండి రావాలసిన సహాయ, సహకారాలు అందుతాయని కలెక్టర్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల సూచనల మేరకు ఉపాధి హామీ పనులు సక్రమంగా పూర్తి చేసిన వారికి రోజుకు మూడు వందల రూపాయల వరకు వేతనం రావడం జరుగుతుందన్నారు.