!!!శిల్పా ఖబడ్దార్..నంద్యాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమికొట్టడానికి సిద్దం.. అభిరుచి మదు!!!

♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

⇔రాష్ట్రానికి సిఎం జగన్ ప్రమాదకారిగా మారిపోయారు.

⇔ బిజెపి కి అవకాశం ఇస్తే..కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తా.

ప్రశాంతమైన నంద్యాలలో ప్రజలను రెచ్చ కొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే శిల్పా ఖబడ్దార్ తరిమి,తరిమి కొట్టడానికి  అభిరుచి మదు వున్నారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అబిరుచి మదు హెచ్చరించారు.ప్రజా పోరు యాత్ర లో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వద్దకు చేరుకొని అందరితో కలిసి బిజెపి చేపట్టిన పథకాలు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన నంద్యాలలో ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి తరిమి కొట్టడానికి అభిరుచి మదు వున్నారని.  ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు.నా వెనుక బిజెపి వుందని గుర్తుపెట్టుకోవాలన్నారు.బ్రిటిష్ వారి మాదిరిగా వ్యాపారం కోసం వచ్చి న మిమ్మలను రాజకీయంగా నంద్యాల ప్రజలు  ఆదరిస్తే ఇండియా.పాకిస్తాన్,మగాడు, అమ్మమొగుడు లేరు అని శిల్పా మోహన్ రెడ్డి,శిల్పా రవి  వ్యాఖ్యలు చేయడాన్ని మదు తప్పుపట్టారు.నంద్యాల ప్రజలకు తాను రక్షకుడిగా వుంటాను అని,శిల్పా కుటుంభం దుష్ట పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. మాట వినని వారిపై  పోలీసులపై కేసులు పెడుతూ భయబ్రాంతులను చేస్తే ఊరుకోబోమన్నారు.,నంద్యాల ప్రజలు అరాచకాలు,అన్యాయాలు తెలుసుకొని ఓటు అనే ఆయుధంతో శిల్పాపాలనకు సమాది కట్టడానికి సిద్దం అయ్యారని అన్నారు.మాట వినని కౌన్సిలర్స్ పైనే కేసులు పెట్టేందుకు సిద్దం అయ్యారని .శిల్పా కుటుంభం దురాగతాలు తెలియని వ్యక్తులు నంద్యాలలో లేరన్నారు.మున్సిపాలిటీలో జీతం,ఇంట్లో పని చేయించుకోవడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు.

వైసిపి ప్రభుత్వ అరాచకాలు,అవినీతి,అక్రమాలు,దురాగతాలు రాష్ట్రానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు.భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగమేఅని అదోగతిపాలు చేసిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బిజెపి ప్రజా పోరు యాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు.వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్దంగా వున్నారని అన్నారు.ఆంధ్రులు సిగ్గుపడే పరిస్థితి కి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. బిజెపి కి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నంద్యాలను  అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.దేశం,రాష్ట్రం,నంద్యాల అభివృద్ధి చెందాలంటే బిజెపి నీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *