కోయిల కట్టిన పుణ్యక్షేత్రమే… నేటి కోవెలకుంట్ల

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

కోవెలకుంట్ల శ్రీపాండురంగ విఠలేశ్వరుని ఆలయ చరిత్ర

 

 

 

 

 

 

 

 

నంద్యాలజిల్లా  కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల గ్రామంలో శ్రీ పాండురంగవిఠలేశ్వర ఆలయం కొలువైఉంది..ఇది చాలపురాతనఆలయంగాప్రసిద్దిచెందింది.క్రీశ.13వశతాబ్దంలో కాకతీయ ప్రభువులకాలంనాడు కోయిల అను పేరుగల ఓ నాట్యగత్తె ఉండేదట..ఈమె కలలో పాండురంగ స్వామి కనిపించి ఈ ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించమని ఆగ్నాపించారట.ఆస్వామివారి ఆదేశాను శారం ఇచ్చట ఆలయాన్ని నిర్మించి పాండురంగ విఠలేశ్వర సాలగ్రమ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర.ఈ స్వామివారికి దూప దీప నైవేద్యాలకు కొన్ని భూములను దానంచేసి ఈ ఆలయాభివృద్దికి భక్తురాలు కోయిల ఎంతో దోహదంచేసింది..అందువలన ఈమె పేరుతో ఈ క్షేత్రం కోయిలకుంట్లగా మారి క్రమేణ కోవెలకుంట్లగా పిలువబడుతున్నది…తూర్పు ముఖంగా ప్రవేశద్వారం గల ఈ ఆలయానిాకి దక్షిణ దిశలో అళ్వారుల విగ్రహాలు ఉత్తరం వైపున లక్ష్మీదేవి ఆలయం ఉన్నది..క్రీ.శ 1571,1573,1584 నాటి శాసనాలు ఈ ఆలయ వైభవాన్ని గురించి తెలియచేస్తాయి..ఇచ్చట నిత్యపూజలతో పాటు పర్వదినాలలో విశేషపూజలు నిర్వహిస్తారు..నంద్యాల జిల్లా కేంద్రంనుండి ఈ క్షేత్రానికి బస్సులు కలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *