ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
⇔భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారు.
⇔సండే ఎమ్మెల్యే కావాలా…పాలించే నాయకుడు కావాలా.
⇔నవ నందుల నిలయంలో సాగు,తాగునీరు కు ఇక్కట్లు.
భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం ఎడారి లా మార్చిందని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గంలో ప్రజా పోరు యాత్రకు అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు శ్రీకారం చుట్టారు.నంద్యాల పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి భారీ వాహన శ్రేణితో గ్రామాలకు బయలుదేరారు.
నంద్యాల మండలం లోని కొత్త పల్లె, బిల్లలా పురం,అబాండం తాండా ,అయ్యాలురు గ్రామాల్లో ప్రజా పోరు యాత్రకు విచ్చేసిన బిజెపి నాయకులకు ప్రజలు బిజెపి కార్యకర్తలు పూలవర్షం తో ఘన స్వాగతం పలికారు.అనంతరం బిజెపి నేతలు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్రప్రభుత్వం ఇస్తున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.ప్రచార రథం పై గ్రామాల్లో తిరిగారు.ప్రధాన కూడలిలో బిజెపి నేత అబిరుచి మధు మాట్లాడుతూ భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం ఎడారిగా మార్చిందని ఆరోపించారు.నవనందులకు ప్రసిద్ది అయిన నంద్యాల లో సాగు, తాగునీరు కు రైతులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రాజధాని లేని రాష్ట్రం కావడంతో సిగ్గుపడాలనీ అన్నారు.యువత ఉద్యోగాలు,ఉద్యోగులకు జీతాలు,అభివృద్ధి,అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలన్నా బిజెపి ప్రభుత్వంతో నే సాధ్యమవుతుందని అన్నారు.పరిశ్రమలు రావడంలేదు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్తిక్కర్లు వేసి గొప్పలు చెప్పుకుంటుంది అని విమర్శించారు.అమృత పథకానికి నిధులు ఇచ్చినా కమీషన్ ల కక్కుర్తి తో వైసిపి అదికారంలో ఉన్న 5ఏళ్లలో పూర్చిచేయలేక పోయారని విమర్శించారు.వైసిపి జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది అన్నారు.ప్రజలపై పన్నుల భారం వేస్తున్న చెత్త ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.నంద్యాలకు సండే ఎమ్మెల్యే కావాలా,పాలన చేసే నాయకుడు కావాలో తేల్చుకోవాలని అన్నారు.రాష్ట్రం అభివృద్ది,బాగుపడాలంటే బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కసెట్టీ కృష్ణ మూర్తి,చంద్ర శేఖర్,గంగాధర్,స్వాతి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.