ఏపీ 2021-22 బడ్జెట్ ముఖ్యాంశాలివే..

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు..

 

2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు

గత బడ్జెట్ అంచనా రూ.2,24,789 కోట్లు

వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32శాతం అధిక కేటాయింపులు

బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840 కోట్లు, మైనార్టీ సబ్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు

పిల్లల కోసం రూ.16,748 కోట్లు, మహిళాభివృద్ధికి రూ.47,283 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు, విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు

 

వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు

జగనన్న వసతి దీవెనకు రూ.2,223.15 కోట్లు

వైఎస్సార్– పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ.500 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.1,112 కోట్లు

కాపు నేస్తం కోసం రూ. 500 కోట్లు, ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు

వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం కోసం రూ.300 కోట్లు

వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు

వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్సార్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 కోట్లు, లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు

 

వైఎస్సార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు

రైతుల పథకాలకు రూ.11,210.80 కోట్లు

వైఎస్సార్ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.88.57 కోట్లు

వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ.1802.82 కోట్లు

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

వైఎస్సార్ పశువుల నష్టపరిహార పథకానికి రూ.50 కోట్లు

విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు

దీంట్లో స్కూళ్లలో నాడు–నేడుకు రూ.3,500 కోట్లు

జగనన్న గోరుముద్ద కోసం రూ.1,200కోట్లు

జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు

ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు

వైద్యారోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు

ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ. 1,535 కోట్లు

కొవిడ్‌పై పోరాటానికి రూ.వెయ్యి కోట్లు, పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు

 

ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌ కోసం రూ.100 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *