అమరావతి: ఒక్కరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సీఎం జగన్, పలువురు మంత్రులు మాస్క్లు లేకుండానే వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పే ముఖ్యమంత్రి, మంత్రులు.. మాస్కులు ధరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మాస్క్ నిబంధనలు ప్రజలకేనా..? సీఎం జగన్, మంత్రులకు వర్తించవా? అంటూ చర్చ జరుగుతోంది. మాస్క్లు ధరించాలంటూ అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో చెవిరెడ్డితో పాటు సీఎం జగన్కు మాస్క్లు లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.