న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే రాహుల్‌తో మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆ సమయానికి విరాట్ కోహ్లీ సేనతో ఇంగ్లండ్‌లో ఉంటాడు. దీంతో భారత్ ద్వితీయ జట్టుకు మరో కోచ్ అవసరం ఏర్పడింది. అయితే లంకలో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సల కోసం జట్టు ను ప్రకటించాల్సి ఉంది. 2014లో భారత జట్టు ఇం గ్లండ్ టూర్‌లో ద్రవిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. అలాగే అతడి ఆధ్వర్యంలో భారత ‘ఎ’, అండర్-19 జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి.