నంద్యాల ఏప్రియల్ 20 (ప్రజాన్యూస్) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిాపక్షనేత చంద్రబాబు నాయడు 73వ జన్మదినవేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.టిడిపి రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు ఆద్వర్యంలో నంద్యాల పట్టణంలోని చైతన్య వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అనంతరం దిావ్యాంగ విద్యార్ధులకు అన్నవితరణచేశారు..చిన్నారులకు పుస్తకాలు పంపిణీచేశారు సందర్బంగా హరిబాబు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుపై ఆదారపడిందన్నారు..చంద్రబాబు నాయుడు రాజకీయాలకే రాజసం అని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అబివృద్ది అంటే ఏంటో చేసి చూపాడన్నారు..రాష్ట్రవిభజన అనంతరం పట్టిసీమ తో కరువుసీమఅనంతను రత్నాలసీమచేశాడన్నారు..ప్రపంచదిగ్గజాలను ఆంద్రకు రప్పించి పారిాశ్రామిక ప్రగతికి పునాదులు వేసి నిరుద్యోగులపాలిట వరంగా మారారన్నారు..ఇలాంటి దార్సినికుడ్ని మళ్లీ ముఖ్యమంత్రిగాచేసుకోవాల్సిన అవసరం నేడు ఉందన్నారు..2024 ఎన్నికలలో చంద్రబాబును ముఖ్యమంత్రిగాచేసేందుకు ప్రతి ఒక్కరం కృషిచేసి వచ్చే పుట్టినరోజుకు కానుకగా ఇవ్వాలన్నారు..కార్యక్రమంలో టిడిపినేతలు కుందూరు మోహనరెడ్డి, నాయుడు టిడిపి కార్యకర్తలు నేతలు ఆశ్రమనిర్వాహకులు అదికసంఖ్యలో పాల్గొన్నారు.