ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
విజయవాడ, 19అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
జమియత్ ఉలేమా ఎ హింద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ మరియు హజ్ కమిటీ చైర్మన్ హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ గారు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూఖ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంలో ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ గారు మరణం ముస్లిం సమాజానికి మరియు రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. మతపరమైన, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా, హజ్ కమిటీ చైర్మన్గా ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని, మైనార్టీల సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూఖ్ గారు దివంగత మౌలానా పీర్ షబ్బీర్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అల్లాహ్ను ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు మరియు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.