ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
మైదుకూరు, జూలై 18(ప్రజాన్యూస్) : నల్లమల భైరవకోనలోని మొండి భైరవుడిని దర్శనానికి వెళ్లిన వందమందికి పైగా భక్తులు పెద్ద వంక ప్రవాహం పెరగడంతోవంకలో చిక్కుకుపోయారు. కడప జిల్లా మైదుకూరు మండలం ముద్దిరెడ్డిపల్లె తాండా సమీపంలో జరిగిన ఘటన వివరాలు… మొండి భైరవుడి దర్శనానికి ప్రతి ఆదివారం వందలాది మంది భక్తులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై వెళుతుంటారు. ఈనేపద్య్ంలో ప్రొద్దుటూరు, కడప, ఆళ్లగడ్డ, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాంతాల వారు 30 ట్రాక్టర్లలో వెళ్లారు. మొక్కులు తీర్చుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మెట్ల పెద్ద వంక పొంగి ప్రవహిస్తుండడంతో దాటడం సాధ్యం కాలేదు. కొందరు యువకులు ధైర్యం చేసి తాళ్ల సహాయంతో కొందరు మహిళలు, పిల్లలను ఇవతల ఒడ్డుకు చేర్చారు. వంక ప్రవాహం దాదాపు 10 అడుగుల ఎత్తుకు చేరడంతో పాటు చీకటి పడుతుండటంతో మిగిలిన వారిని ఇవతలకు తీసుకరాలేకపోయారు. ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని వాగు అవతల చిక్కుకున్న వారికి ఆహారం అందచేశారు.