ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,18 సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్)
ఆళ్లగడ్డ పట్టణంలోని జీవిత బీమా సంస్థ శాటిలైట్ కార్యాలయంలో గురువారం హర్ ఘర్ బీమా వాల్ పోస్టర్లను బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ బి వి ఎస్ ఎల్ శ్రీనివాసులు మాట్లాడుతూ, బీమా సేవలపై GST తొలగింపు విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆర్థిక సంస్కరణ చేయడం జరిగిందని , ఈనెల 22 నుండి బీమా సేవలపై 0 శాతం జీఎస్టీ విధానం అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పాలసీలను తీసుకోవడం ద్వారా అన్ని గృహాలలో బీమా జ్యోతులను వెలిగించవచ్చని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు వివరించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ పరిపాలన అధికారి మురళీధర్ రావు, సిబ్బంది దస్తగిరి, ఏజెంట్లు పాల్గొన్నారు.