అనంతపురం జూలై 18(ప్రజాన్యూస్): జిల్లాలోని నల్లమాడ మండలం చారుపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి బాపణకుంట తెగిపోయింది. నీటి ఉధృతికి గొఱ్ఱెల మందనీటి ప్రవాహంలో గల్లంతైంది. సుమారు మూడు వందల గొర్రెలు కొట్టుకుపోయాయి. దాంతో గొర్రెల కాపరులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అధికారులు ఆదుకోవాలని బాధితులు వాపోతున్నారు.