పెసరవాయి జంట హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఎంఎల్ఎ కాటసాని రాంభూపాల్ రెడ్డి

కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్): కర్నూలుజిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలోశుక్రవారం జరిగిన జంటహత్యలకు తనకు ఎలాంటి సంబందంలేదని పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టంచేశారు.. ఘటన దురదృష్టకరమని,  హత్య రాజకీయాలకు తాను తన కుటుంబం వ్యతిరేకమని చెప్పారు. ఈనెల 7న నేను ప్రతాప్‌రెడ్డితో మాట్లాడానని తెలిపారు. ప్రతాప్‌రెడ్డిపై గతంలోనే రౌడీ షీట్ ఉందని చెప్పారు. టీడీపీ నేత లోకేష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ జరిపించాలని రాంభూపాల్‌రెడ్డి కోరారు.

 

Dailyhunt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *