హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రులు వద్దు.. ప్రభుత్వాస్పత్రులు ముద్దంటున్నారు.. మరి సీఎం, మంత్రులు కరోనా వస్తే ఎక్కడికి వెళ్లారు? అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సిటీస్కాన్, వెంటిలేటర్లు ఉన్నాయని? ప్రశ్నించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. కనీసం ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ అయినా పెట్టారా? అని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సీతక్క నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి కరోనా బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.