ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ/అహోబిళం,ఏప్రియల్ 18(ప్రజాన్యూస్)
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న ఆరు నెలల లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర ఎనర్జీ రెన్యువల్ శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. శుక్రవారం అహోబిలం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక వరం లాంటిదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రాజెక్టును త్వరలోనే నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి తెలిపారు. అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఈరోజు తనకు ఎంత ఆనందంగా ఉందని ..తమ ఇంటి దైవం కులదైవం అయిన లక్ష్మీనరసింహస్వామి వారు తమకు ఆరాధ్య దైవమని ఆయన తెలిపారు. కర్ణాటకలోని బీజాపూర్ లో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉందని ఆయన తెలిపారు.