ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 16 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో రిసర్వే 13వ నోటిపికేషన్ డ్రాప్ట్ డిఎల్ ఆర్ వివరాలను దొర్నిపాడు తహసిల్దార్ సుబద్ర, డిప్యూటీ తహసిల్దార్ మాదవ్ ప్రకటించారు..

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో తహసిల్దార్ సుభద్ర ఆద్వర్యంలో రైతులకు గ్రామ సచివాలయంలో గ్రామసభ నిర్వహించారు..ఈసందర్బంగా ఇటీవల నిర్వహించిన రీసర్వే డ్రాప్ట్ ల్యాండ్ రిజిష్టరును రైతులకు వివరించారు..ఈసందర్బంగా తహసిల్దార్ సుబద్ర మాట్లాడుతూ బ్రటీషుకాలంనాటి సర్వే స్థానంలో నూతనంగా సర్వే చేసి అత్యాదునిక పద్దతులతో రైతులకు సర్వే వివరాలను అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు.. ఈమేరకు రామచంద్రాపురం గ్రామంలో రైతుల సమష్టి సహకారంతో రీసర్వే పూర్తిచేశామన్నారు.పూర్తివివరాలుఅందించిన రైతులకు ఎల్ పి ఎం నంబరు కేటాయించామని, వివరాలు అందని భూములకు మిగులు భూమిగా గుర్తించి ప్రత్యేక ఎల్ పి ఎం కేటాయించామన్నారు.రైతులు డ్రాప్ట్ పలితాలను చూసుకుని తమ అభ్యంతరాలను మరో 15 రోజులలోగా తహసిల్దార్ కార్యాలయంలో అందించాలన్నారు.ఈ సందర్బంగా.డిప్యూటీ తహసిల్దార్ మాదవ మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామంలో అందని సహకారం రీసర్వే టీంకు రామచంద్రాపురం గ్రామంలో లభించిందన్నారు..తాము ప్రకటించిన డి ఎల్ ఆర్ పలితాలు కేవలం తాత్కాలికమేనని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తమ భూములలో తేడాలు ఉంటే మరోసారి పరిశీలించి రైతులకు న్యాయంచేస్తామన్నారు..మిగులు భూములుగా నమోదైన సర్వే నెంబర్లలో ఎవరైనా తమ డాక్యుమెంట్లు అందిస్తే వారి భూమిని నమోదుచేస్తామన్నారు..అలాగే ఏదేని సమస్యలు ఉంటే రైతులందరి ఒప్పందంతో తాము పరిష్కరిస్తామన్నారు..రైతులు ఒకభూమిలో అనుభవంలో ఉండి మరో భూమిలో రిజిష్టరుచేసుకుని ఉంటే వారు సవరణచేసుకుంటే తాము తిరిగి వారి బూమిని వెబ్ ల్యాండ్ లో నమోదుచేస్తామన్నారు..వి ఆరో ఓ నారాయణ స్వామి మాట్లాడుతూ రైతులు ఎవరైనా తమ సమస్యలు ఉంటే వివరాలతో తనకు అందించాలని వారి సమస్యల నివారణకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు..కార్యక్రమంలో వి ఆర్ ఓ నారాయణ స్వామి, మండల సర్వేయరు మోజస్ ,గ్రామ సర్వేయరు శ్రావణి,గ్రామ రైతులు పాల్గొన్నారు..