*కోకాపేట్,ఖానామెట్ భూములు ఇప్పుడు కోట్లు పలికాయి..!?* *బెజవాడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే 46 కోట్లు ఉంది..!!* *అమరావతి రాజధాని ఉండి ఉంటే …?*

దామోదర్ చిగులూరి జర్నలిస్టు అమరావతి

*కోకాపేట్,ఖానామెట్ భూములు ఇప్పుడు కోట్లు పలికాయి..!?*

*బెజవాడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే 46 కోట్లు ఉంది..!!*

*అమరావతి రాజధాని ఉండి ఉంటే …?*

అమరావతి రాజధాని కాకముందే బెజవాడ,గుంటూరు జాతీయ రహదారి వెంట భూముల ధరలు హాట్ కేక్ లా పలికేవి. ఎకరం 7 నుంచి 15 కోట్లలో ధరలు ఉండేవి.అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బెజవాడ బందరు రోడ్డు రాష్ట్రంలోనే అత్యధిక రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండేది.చదరపు గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 80 వేలు ఉంటే, హైదరాబాద్ లో పోష్ ఏరియాల్లో కూడా చ.గజం 44 వేలు మించి లేదు.ఇది పూర్తిగా వాస్తవం.ఇప్పుడైనా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఎంత ఉందో రిజిస్ట్రేషన్ రికార్డుల్లో స్పష్టంగా ఉంది.అంటే రాష్ట్రం విభజన జరగక ముందే బెజవాడలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ అంత ఉంది అంటే బెజవాడ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.బందరు రోడ్డులో కేవలం చదరపు గజం లెక్కన రిజిస్ట్రేషన్ చేసేవారు.ఎకరాల్లో ఎప్పుడూ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే భూముల ధరలు ఎక్కువని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చదరపు గజాల్లో కి మార్పు చేసింది.రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చ.గజం 80 వేలు ఉంది.ప్రస్తుతం బెజవాడ బందరు రోడ్డులో చ.గజం 96 వేల 400 రూపాయలు ఉంది.అంటే ఎకరం 46కోట్ల65లక్షల76 వేల రూపాయలు ధర పలుకుతుంది.ఇది రిజిస్ట్రేషన్ బుక్ వ్యాల్యూ మాత్రమే.అదే ప్రైవేట్ మార్కెట్ లో బందరు రోడ్డులో ఎన్ని కోట్ల ధర పలుకుతోంది అంటే చెప్పలేం.కోకాపేట్ లో వేలం వేస్తే ఎకరం 60 కోట్లు,ఖానామెట్ లో 55 కోట్లు పలికింది.కానీ బెజవాడలో అలాంటి వేలం లేకుండానే రిజిస్ట్రేషన్ బుక్ వ్యాల్యూనే ఎకరం 46 కోట్లు ఉంది అంటే బెజవాడ స్టామీనా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ లో ఎప్పుడూ బూమ్ ఉండేది.కానీ బెజవాడలో భూముల ధరలు షేర్ మార్కెట్ లో లా పడటం,లేవడం ఉండేది కాదు.ఏపీ లో బూమ్ అంటే తెలియదు.రాష్ట్ర విభజన జరగడం అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని అనే స్పెక్యులేషన్స్ నేపధ్యంలో నే బూమ్ అంటే ఏమిటో బెజవాడ వాసులకు తెలిసింది.అప్పటికి ముందే బెజవాడలోనూ,విజయవాడ-గుంటూరు హైవే లో ఎకరం 10 కోట్లు పలికింది,విజయవాడ- మచిలీపట్నం రోడ్డులో 5 నుంచి 7 కోట్లు పలికింది,విజయవాడ-గన్నవరం హైవే లో 10 కోట్లు ధర ఉంది.ఇదేదో బూమ్ కాదు.ఈ మార్గాలు అన్ని బంగారు భూమి అని చెప్పాలి.కానీ రాష్ట్ర విభజన సమయంలో మాత్రమే అనుకోని బూమ్ వచ్చిందని చెప్పాలి.అదీ ఈ ప్రాంత వాసుల వల్ల కాదు.అమరావతి రాజధాని అవుతుందని గన్నవరం,నూజివీడు ఏరియాల్లో ఎకరం 25 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన వారిలో మెజార్టీ ప్రజలు హైదరాబాద్ వాసులే అనిచెప్పాలి.అమరావతి కోర్ ఏరియా కొనుగోళ్లు లో కూడా భూమి యజమానులు నుంచి కొనుగోలు చేసింది 30 శాతం ఆంధ్రా వాళ్ళు ఉంటే 60 శాతం హైదరాబాద్, మరో 10 శాతం ఎన్. ఆర్.ఐ లు అని చెప్పాలి.గత ప్రభుత్వం లో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో కొత్త ప్రాజెక్ట్ లు రావడం తో అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో బూమ్ వచ్చింది అని చెప్పాలి.ఎప్పుడైతే ఏపీ లో ప్రభుత్వం మారిందో అమరావతి రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో రాజధాని పేరుతో వచ్చిన బూమ్ కుప్పకూలిపోయింది.అదే బూమ్ తెలంగాణ కు స్థిర పడిందని చెప్పడంలో సందేహం లేదు.ఆ కారణం చేత కోకాపేట్ భూముల వేలంలో ఎకరం 60 కోట్లు,ఖానామెట్ లో 55 కోట్లు పలికింది .అంతర్జాతీయ నగరం గా గుర్తింపు పొందిన హైదరాబాద్ కోకాపేట్ లో ఎకరం 60 కోట్లు,ఖానామెట్లో55కోట్లుపలకడంతక్కువేఅనిచెప్పాలి.ఐటి,ఫార్మా,సినీ,హాస్పిటటల్,మీడియా,వంటి ఇంటర్నేషనల్ హంగులు ఉన్న హైదరాబాద్ కోకాపేట్ పలికిన ధర ఏమంత గొప్ప ధర కాదని చెప్పాలి.అదే అమరావతి రాజధాని ఇక్కడే ఉంది ఉంటే అమరావతి భూముల్ని వేలంలో పాడటం సాధ్యం అయ్యేది కాదు అనేది వాస్తవం. అదే ఆంధ్ర ప్రజల దురదృష్టం అనేది వాస్తవం.అమరావతి రాజధానిగా ఉంది ఉంటే బెజవాడ కు 100 కి.మీ పరిధిలో భూములు ఎన్ని కోట్లు పలికేవో చెప్పలేం.కానీ దురదృష్టం కొద్దీ రాజధాని గందరగోళం లో పడకపోయి ఉంటే బాగుందేది.పోనీ గత ప్రభుత్వం తన 5 ఏళ్ల సమయంలో రాజధాని 28 గ్రామాల పరిధిలోగాని,కోర్ ఏరియాలో గాని నిర్మాణాలు పూర్తి చేయగలిగి ఉంటే అమరావతి సింగపూర్ ను తలపించేది అనడంలో సందేహమే లేదు.ఆంధ్ర ప్రజల రాజధాని అయోమయం తెలంగాణ కు కలిసి వచ్చిన వరం.
*దామోదర్.చిగులూరి*
*జర్నలిస్ట్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *