ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
డిల్లీ,మార్చి 17 (ప్రజాన్యూస్);;
నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు పెట్టాలని భారత పౌర విమానాయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం అందించారు
సోమవారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు పెడతామని తెలిపి ఆయన పేరు పెట్టకుండా రాయలసీమ ప్రజలను విస్మరించారని విమర్శలు చేశారు. బ్రిటిష్ వారిపై తొలి తిరుగుబాటునేత, తొలి స్వాతంత్ర సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఓర్వకల్లు విమానాశ్రాయానికి పెట్టాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించడం పట్ల ఆమె ధన్యవాదములు తెలిపారు.