ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, సెప్టెంబరు 16 (ప్రజాన్యూస్) ::
దేశ ప్రజల ఆరాద్యదైవం భారత ప్రదాని నరేంద్రమోడి జన్మదినం సెప్టెంబరు 17ను పురస్కరించుకుని సెప్టెంబరు 17నుండి అక్టోబరు 2 వరకు జరుపుతున్న సేవా పక్షోత్సవాలను జయప్రదంచేయాలని నంద్యాలజల్లా బిజెపి అద్యక్షుడు అభిరుచి మదు బిజెపి శ్రేణులకు పిలుపు నిచ్చారు..
ఈసందర్బంగా ఆయన నంద్యాలజిల్లాస్థాయి బూత్ మండల కమిటీలతో సమావేశం నిర్వహించారు..అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియతమ ప్రదాని నమో జన్మదినం సందర్బంగా నంద్యాలజిల్లావ్యాప్తంగా సేవపక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు..ఇందులో భాగంగా సెప్టెంబరు 17న బూత్ స్థాయిలో స్వచ్చతా అభియాన్ ను బహిరంగా ప్రదేశాలలో నిర్వహిస్తామని,పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు,పార్కులలో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు..సెప్టెంబరు 10 నుండి అక్టోబరు 2వరకు మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు ప్రతిగ్నలతోపాటుగా ,సెప్టెంబరు 25 న రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక నగర సంస్ధల ద్వారా ఆత్మనిర్బల్ బారత్, స్వదేశీ వస్తువులు పై ప్రచారం స్తానిక జాతరులు మరియు ప్రదర్శనలు, పండిట్ దీన్ దయాల్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించే కార్యక్రమం, మోక్కలు నాటగడం,బూత్ కార్యకర్తలతో సమావేశం వారితో కలిసి బోజన కార్యక్రమం చేస్తామన్నారు..అక్టోబరు 2న స్వచ్చత అబియాన్ లో బాగంగా మహాత్మాగాందీ, లాల్ బహుదుర్ శాస్త్రిల చిత్రాలకు నివాళులు అర్పించిడం,ఖాదీవస్తువలు కొనుగోలు, ప్రోత్సాహం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.. వికససిత్ బారత్ చిత్రకళ పోటీలలో భాగంగ అభివృద్దిచెందిన భారతదేశం అనే అంశంపై పెయింటింగ పోటీలను, నమో వనాలు,నమో పార్కులు,రాష్ట్ర ప్రభుత్వం, నగర్ కార్పొరేషన్ మునిసిపాలిటీల ద్వారా నిర్మాణం చేపట్టే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు..భారతదేశంతోపాటు ప్రపంచదేశాలు నమో జపం చేస్తున్న ఇలాంటి మహానేత జన్మదినాన చేపట్టే ఈకార్యక్రమాలను జయప్రదంచేయాలని బిజెపి అద్యక్షులు అభిరుచి మదు శ్రేణులను కోరారు..