ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 16 (ప్రజాన్యూస్) ::
నంద్యాలపట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో టిడిపి జిల్లాకార్యదర్శి పిరోజ్,మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆద్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు..ఈ ర్యాలీని మంత్రి ఎన్ ఎండి పరూఖ్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు..
రాష్ట్రవ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి సంబరాలు నిర్వహిస్తోంది..ఈనేపద్యంలో అన్నదాతసుఖీభవ పదకం క్రింద రైతులకు వారి ఖాతాలో 7 వేలు జమ అయిన సందర్బంగా నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, టిడిపి జిల్లా కార్యదర్శి పిరోజ్ ఆద్వర్యంలో రైతులతో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు..టెక్కె మార్కెటు యార్డులో మంత్రి పరూఖ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించగా పట్టణంలోని ప్రదాన వీదులలో మునిసిపల్ కార్యాలయం వరకు వందలాది ట్రాక్టర్లలో రైతులు ర్యాలీ నిర్వహించారు..అనంతరం మంత్రి పరూఖ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలముందు ఇచ్చిన మానిపెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పదకం సూపర్ హిట్ అయ్యిందన్నారు..రాష్ట్ర ఆర్దిక పరిస్తితి ఆశాజనకంగా లేనప్పటికి సమర్ఢుడైన ముఖ్యమంత్రి మనకు ఉండటంతో ఓ వైపు సంక్షేమం,మరో వైపు అభివృద్ది జరుగుతోందన్నారు..ఏడాదిలోపే దీపం క్రింద ఉచిత గ్యాస్, తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ స్త్రీ శక్తి పదకం లాంటి అన్ని పదకాలను 90 శాతం మేర అందించామన్నారు..వైసిపి ప్రభుత్వ హయాంలో రాజదాని అమరావతి పోలవరం అటకెక్కించగా వాటిని యుద్దప్రాతిపదికన పూర్తిచేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి రదసారధి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు..కార్యక్రమంలో అదికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు..