ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
అమరావతిజూలై 15(ప్రజాన్యూస్): కోర్టు తీర్పును 14 నెలలపాటు అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావుకు హైకోర్టు 2వారాల సాధారణ జైలుశిక్ష , రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. డీఈవో తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు వారం పాటు తీర్పు అమలును నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ 13న ఉత్తర్వులు జారీచేశారు. లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కొమరవోలు మండలం, కొత్తపల్లి గ్రామంలోని ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయుడు కె.అంజనీకుమార్ 2019లో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ విడుదల చేయాలని 2019 ఆగస్టు 22న కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు అమలులో 14 నెలల జాప్యం కావడంతో భాదితుడు కోట్లు మెట్లెక్కాడు.దీంతో కోర్దు దిక్కరణక్రింద న్యాయమూర్తి శిక్షవేశారు..