ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
అమరావతి 10 మే 2025(ప్రజాన్యూస్)
తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహీద్ హుస్సేన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరియు ముఖ్యమైన సంస్థాగత విషయాలపై వీరిరువురు చర్చించారు. పార్టీ కార్యకలాపాలు మరింత ప్రభావవంతంగా సాగేలా ఏయే సూచనలు తీసుకోవాలో అధ్యక్షులు పల్లాకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వహీద్ హుస్సేన్ వివరించారు..అనంతరం పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని అధ్యక్షులు పల్లాకు వహీద్ హుస్సేన్ హామీ ఇచ్చారు..పార్టీ సూచనలు పాటిస్తూ పార్టీ పటిష్టతకు కృషిచేయాలని ఈసందర్బంగా రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాసరావు వహీద్ హుస్సేన్ కు సూచించారు..