యాళ్లూరు వక్ప్ ఆస్థులను లీజుకు ఇస్తే సహించేదిలేదు..ముత్తవలీలు

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

ఆళ్లగడ్డ,14మే 205 (ప్రజాన్యూస్)

వక్ప్ ఆస్తుల లీజు ప్రక్రియ తో భవిష్యత్తును భూతకాల తప్పిదాలతో తాకట్టు పెట్టొద్దని గోస్పాడు మండలం యాళ్లూరు ముత్తవలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..వివరాలలోకి వెళితే గోస్పాడు మండలం యాళ్లూరులో మసీదుకు చెందిన 62.73 ఎకరాల భూమిలో 40 ఎకరాలను అనాదిగా 5 మంది ముత్తవలీలు సాగుచేసుకుంటున్నారు..ఇటీవల ఈ భూమిని ముస్లిమేతరులకు లీజుకు ఇచ్చేందుకు అదికారులు చర్యలు తీసుకున్నారని అనాదిగా తాము సాగుచేసుకుంటున్న మసీదు భూములు ఇతరులకు ఇస్తే తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు..ఇటీవలి కాలంలో వక్ప్ బోర్డు ఆధ్వర్యంలోని పవిత్ర ఆస్తులను స్వల్ప కాలిక లీజు పేరిట మళ్లీ లబ్ధిదారులకు అప్పగించేందుకు చొరవ చూపిస్తున్న కొంతమంది అధికారుల తీరు తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని,. గత రెండు నెలల క్రితం, వక్ప్ ఆస్తుల లీజు వేలం నోటిఫికేషన్ పత్రికల్లో ప్రచురితంకావడంతో దీనిపై ముస్లిం సంఘాలు గళమెత్తగా  ముఖ్యమంత్రి చంద్రబాబు  స్వయంగా స్పందించి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ప్రక్రియను ఆపించినప్పటికి  ఇప్పుడు మళ్లీ అదే వైనంతో, “పొడి గిస్తూ” లీజుకు ఇవ్వాలని భావించే అధికారులపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయని ముత్తవలీలు ఆరోపిస్తున్నారు.

నూతన వక్ప్ బిల్లుపై చర్చలు ఇంకా నడుస్తున్న ఈ సమయంలో, ఇటువంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వక్ప్  ఆస్తులు మతపరమైన, సామాజికపరమైన ఆస్తులని, అవి కొన్ని ప్రయోజనాల కోసం అమ్ముడుపోవడం, లేదా లీజు పేరిట చెరగిపోవడం నిబంధనలకు విరుద్ధం మాత్రమే కాక, అనైతికం అని వారు పేర్కొన్నారు..ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని యాళ్లూరులో లీజు పేరుతో ఇతరులకు మసీదు భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు తావు లేకుండా కట్టుదిట్టమైన విధానాలు రూపొందించాలని యాళ్లుూరు ముత్తవలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *