శ్రీ రామకృష్ణ కళాశాలఘనంగా జరిగిన జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ RIPPLES 2k24

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

స్థానిక పట్టణ ఎస్బిఐ కాలనీ లోని శ్రీ రామకృష్ణ కళాశాల లో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ RIPPLES 2k24 అనే పేరుతో ఘనంగా జరిగింది….

కళాశాల చైర్మన్ Prof. రామకృష్ణ రెడ్డి, డైరెక్టరు G. హేమంత్ రెడ్డి అధ్యక్ష, పర్యవేక్షణ లో జరిగిన ఈ మీట్ కు ముఖ్య అతిధులుగా కర్నూలు రాయలసీమ యూనివర్శిటీ మేనేజ్మెంట్ డిపార్టుమెంటు ప్రొఫెసర్ C. విశ్వనాథ రెడ్డి  అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రాఫసర్ డాక్టర్. C.H కృష్ణుడు   సభ కు ముఖ్య అతిధులుగా కళాశాల ఎస్టేట్ మేనేజర్ శ్రీమతి A.S ప్రగతి రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ KVB సుబ్బయ్య విశిష్ట అతిథులుగా విచ్చేసారు. ఈసందర్బంగా 
కళాశాల డైరెక్టర్ G. హేమంత్ రెడ్డి  మాట్లాడుతూ ఇలాంటి మీట్స్ వల్ల   విద్యార్థులకు సృజనాత్మక శక్తి పెరుగుతుందని విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు

కళాశాల ఛైర్మన్ ప్రొఫెసర్ రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ MBA విద్యార్థీనీ విద్యార్థులు ఉద్యోగం కోసం కాదు ఉద్యోగం ఇచ్చే స్థాయి కి వెళ్ళాలి అని చెప్పారు. ప్రతి MBA విద్యార్థి ఒక సంస్థలో అవకాశం కోసం ఎదురు చూడటం అనే కోణంలో కాకుండా వారు నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఇంకొకరికి అవకాశం కల్పించే దిశగా ఆలోచించినపుడే వారు అభివృద్ది సాధిస్తారన్నారు

అనంతరం అతిథిగా విచ్చేసిన అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము మేనేజ్మెంట్ విభాగ అధ్యాపకులు డాక్టరు CH కృష్ణుడు  మాట్లాడుతూ MBA విధ్యార్థులు ప్రపంచంలోనీ ఎక్కడైనా మనుగడ సాధించే విధంగా అభివృద్ధి చూడాలని అందుకోసం వారు చాలా విషయాలపైన ప్రతేక శ్రద్ధ వహించాలని పిలుపు నిచ్చారు.

 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్శిటీ మేనేజ్మెంట్ విభాగ అధిపతి ప్రొఫెసర్ C. విశ్వనాథ రెడ్డి  మాట్లాడుతూ MBA విద్యార్ధులకు ఎక్కడున్న చాలా ప్రాధాన్యత ఉంటుందని అటువంటి విధ్యార్థులు ఈరోజు 6000 కి 7000 నెల జీతానికి పని చేయాల్సిన అవసరం వచ్చిందని దానికి కారణం సరైన నైపుణ్య విలువలు లేకపోవడమే అని సృజనాత్మకగల విధ్యార్థులకు అవకాశాలు లేక పోలేదు అన్నారు.ఇలాంటి మీట్స్ పర్సనాలిటీ డెవల్మెంట్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అని చెప్పారు. ..అనంతరం కళాశాల సంప్రదాయం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులను కళాశాల యాజమాన్యం చాలా ఘనంగా సన్మానించారు

తదనంతరం నిర్వహించి 6 విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు ఛైర్మన్ Prof. రామకృష్ణ రెడ్డి , డైరెక్టరు G. హేమంత రెడ్డి  మరియు ముఖ్య అతిధులు చేతులమీదుగా బహుమతుల ప్రధానం జరిగింది.అనంతరం కళాశాలసాంప్రదాయం ప్రకారం అతిదులను ఘనంగా సన్మానించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *