సాయిబాలజానర్శింగ్ హోం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

👉. డాక్టర్ హరినాథ్ రెడ్డి డాక్టర్ లక్ష్మీప్రసన్నల సేవలు ప్రశంసనీయం: డాక్టర్ రవి కృష్ణ
👉. 300 మందికి ఉచిత వైద్య సేవలు
👉. వందమందికి ఉచిత గుండె స్కానింగ్ పరీక్షలు, అందరికీ ఈసీజీ, షుగర్ పరీక్షలు
👉మూడు లక్షల రూపాయల ఉచిత మందుల పంపిణీ
**********.నంద్యాల, పిబ్రవరి 16( ప్రజాన్యూస్)**********

నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసన్న నిర్వహణలో, నంద్యాల ఐఎంఏ వైద్యుల సహకారంతో,ఆదివారం సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆవరణలో షుగరు, బిపి,గుండె జబ్బుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు…ఈవైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది..ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారని, షుగరు, బిపి, గుండె, జబ్బులు ముందుగానే గమనించి చికిత్స చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం తప్పించుకోవచ్చని అన్నారు.శిబిరం నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసన్న వందలాది శిబిరాలు నిర్వహించారని, వైద్య శిబిరాలను ఒక యజ్ఞంలా నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తామన్నారు.ఇండస్ గుండె ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్ గుండె జబ్బుల జాగ్రత్తలు వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్, ఫిజీషియన్ డాక్టర్ గోపి నందన్, సీనియర్ వైద్యులు డాక్టర్ రమణారెడ్డి,ఆసుపత్రి సిబ్బంది మధు, రాజేష్,ఖాదర్ ,సుశీల ,విమల వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు,శిబిరంలో చూపించు కోవడానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.ఈ శిబిరంలో షుగర్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి,డాక్టర్ గోపీ నందన్,స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న, గుండెజబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్, డాక్టర్ రమణారెడ్డి పాల్గొని 300 మంది రోగులను పరీక్షించి,అందరికీ షుగర్ పరీక్షలు,ఈసీజీ,100 మందికి 2డి ఎకో గుండె స్కానింగ్ పరీక్షలు ఉచితంగా చేసి, మూడు లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

🙏🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *