ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 15 (ప్రజాన్యూస్) ::
నంద్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు..
ఈసందర్బంగా జిల్లా అద్యక్షుడు అభిరుచి మదు మువ్వన్నెల జెండా ఆవిష్కరించి జెండా వందనంచేశారు.
.అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 3 వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఎంతో దూరంలో లేదన్నారు. నంద్యాల జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కశెట్టి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు, ఉపేంద్ర రెడ్డి, నిమ్మకాయల సుధాకర్, జిల్లా కోశాధికారి, సాయి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు, డాక్టర్ ఇంటి ఆదినారాయణ బాలముని , మూడవ పట్టణ అధ్యక్షుడు లక్ష్మీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.