ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 15 (ప్రజాన్యూస్) ::
నంద్యాల మార్కెట్ యార్డులో 79 వస్వాతంత్య్రదినోత్సవ వేడుకలు మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈసందర్బంగా మువ్వన్నెల జెండాను చైర్మన్ గుంటుపల్లి ఆవిష్కరించి జెండా వందనం చేశారు..అనంతరం గుంటుపల్లి మాట్లాడుతూ ఎందరో త్యాగదనులు ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్య్ర పలాలను అందించారన్నారు..వారిని స్మరించుకుంటూ దేశ ప్రగతికి వారి బాటలో పయనించాలన్నారు..దేశానికి వెన్నెముక అయిన రైతుకు బాసటగా నిలుస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు..