ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి
అమరావతి జూలై15(ప్రజాన్యూస్):టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశంలో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కీలక చర్చ జరిగిందని ఆ పార్టీ నాయకుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. అంతరాష్ట్ర జలవివాదంపై సమగ్ర చర్చ జరిగిందని ఆయన వివరించారు. లేని వివాదాన్ని కావాలని సృష్టించి ఇద్దరు సీఎంలు ఆయా ప్రాంతాల రక్షకులుగా నటిస్తున్నారని పొలిట్ బ్యూరో భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. సున్నితమైన అంశాన్ని సుహృద్భావ వాతావరణంలో ఎందుకు చర్చించుకోవట్లేదన్నారు.
నీటి సమస్యపై ఇద్దరు సీఎంలకు వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప రాష్ట్రాల ప్రయోజనాలు లేవన్నారు. సీఎంలు ఇద్దరూ రాత్రులు మాట్లాడుకుని ఉదయం ప్రకటనలిస్తున్నారనే అనుమానం అందరికీ ఉందన్నారు. ప్రజల్ని మోసాగించే చర్యలకు స్వస్తి పలికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొల్పిన కృత్రిమ వివాదాలకు చెక్ పెట్టాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు.