ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది ఏలూరు
ఏలూరుజూలై15(ప్రజాన్యూస్): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వరద భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్దిపాటి వరదకే గ్రామాలు జలమయం అవుతున్నాయి..దీంతో ఈప్రాంత ప్రజలలోె భయం నిలువెల్లా ఆవరించింది. గోదావరికి భారీగా వరదలు వచ్చినా ఏ మాత్రం జంకని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఈసారి ముంపు ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల నిర్వాసితులు స్వచ్ఛందంగానే ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.