ప్రజాటివిప్రతినిది ప్రభాకర్ చౌదరి
వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న నంద్యాల మునిసిపాలిటీ చెత్తకుప్పగా మారింది..ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది..మేడిపండు చందంగా నగరానికి కోెట్ల రూపాయలతో సైపై మెరుగులు దిద్దుతూ పైన పటారం లోన లొటారం అన్న సామెతగా మార్చారు..నంద్యాలపట్టణంలో రోజురోజుకు పారిశుద్ద్యం కొరవడి ప్రజలు విలవిలలాడుతున్నారు.
పట్టణంలో ఏసెంటర్ లో చూసినా చెత్తకుప్పలు రోెడ్లపైకి వచ్చి కుక్కులు వాటిపై సైర్వ విహారం చేస్తున్నాయి..మురుగు కాలువలు శుభ్రంచేయక దుర్గందం వెదజల్లుతున్నాయి..పట్టణంలో ఎక్కడైనా కొద్దిసేపు నిలబడతామంటే ముక్కులు మూసుకుని ప్రజలు నిలబడుతున్నారు..పారిశుద్యం కొరవడడంతో దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి..దోమల దెబ్బతో ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు..లక్షలాది రూపాయలు రోగాలకు వెచ్చిస్తున్నారు..ఏ ఆసుపత్రి చూసినా జ్వరాలు దగ్గులతో వచ్చిన రోగులతో నిండిపోతోంది…
నాలుగేళ్లుగా పట్టణంలో పారిశుద్ద్యలోపం స్పష్టంగా ఉన్నప్పటిాకి అందుకుతగ్గ చర్యలు తీసుకోవడంలో అదికారులు ప్రజా ప్రతినిదులు విపలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.. తరుచుగా పట్టణంలో కాలువలు శుభ్రంచేసి బ్లీచింగ్ చేయడం హైపో ద్రావణం పిచికారిచేయడం లాంటి పనులు జరగడం లేదు..బ్లీచింగ్ హైపో ద్రావణం పేరుతో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
పారిశుద్య విభాగంలో సిబ్బందిని పెంచకపోవడం ఉన్న సిబ్బందిలో కొంతమందిని రాజకీయనాయకులు ప్రతినిదులు వారి అనుంగ సేవకులుగా మార్చుకోవడంతో ఈ పరిస్థితినెలకొందని తెలుస్తోంది..సిబ్బందిని పెంచి పట్టణాన్ని అపరిశుబ్రవాతావరణంనుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..
Post Views: 3,261
Like this:
Like Loading...