ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 13 (ప్రజాన్యూస్) ::
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన నామినేటెడ్ పదవులలో కమ్మకార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రహ్మం చౌదరిని నియమించడం పట్ల సీనియర్ జర్నలిస్టు ,ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుపోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూల్పూరి ప్రబాకర్ చౌదరి హర్షం వ్యక్తంచేశారు…
నంద్యాల జిల్లా కేంద్రంలో ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గురజాలకుచెందిన యువకుడు, విద్యావంతుడు పార్టీకోసం ఎన్నో కష్టాలను అనుభవించిన బ్రహ్మంచౌదరికి ఈపదవిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవ్వడం సముచితమని, చంద్రబాబునాయుడుకి ఈసందర్బంగా ప్రభాకర్ చౌదరి దన్యవాదాలు తెలిపారు..చిన్నవయసులోనే పార్టీకోసం అహర్నిశలుపాటుపడిన బ్రహ్మంచౌదరి కమ్మవారి సంక్షేమంకోసం కృషిచేయాలని ఆయన కోరారు..ఈ మద్యకాలంలో కమ్మవారు అనేక సామాజిక అవమానాలను ఎదుర్కుంటున్నారని,కమ్మవారిలో అనేకమంది పేదకుటుంబాలు నేటికి ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపద్యంలో పేద కమ్మవారికి కార్పొరేషన్ చైర్మన్ అండగా ఉండాలని ప్రభాకర్ చౌదరి చైర్మన్ నుకోరారు..కాగా కమ్మకార్పొరేషన్ ఏర్పాటు, బ్రహ్మంచౌదరి నియామకం పట్ల ఉమ్మడి కర్నూలుజిల్లా కమ్మసంఘనేతలు హర్షం వ్యక్తంచేశారు..